నవరాత్రి ఉపవాస వేళల్లో తీవ్ర హెచ్చరిక: ఆరోగ్యంపై వైద్యుల ప్రత్యేక సూచనలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉపవాసాల వేళ ప్రజలు ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పర్శ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మనోహర్ కె.ఎన్. హెచ్చరించారు. మితిమీరిన లేదా నిర్జల ఉపవాసాలు శరీరాన్ని తీవ్రంగా బలహీనపరుస్తాయని ఆయన స్పష్టం చేశారు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండాలని సూచించారు. తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపవాసం విరమించి, వైద్యులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.