ఈవీఎంల ట్యాంపరింగ్పై విచారణ జరపాలి: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

దేశంలో ఎన్నికల వ్యవస్థ పారదర్శకతపై అనేక అనుమానాలున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై తక్షణమే విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాలని స్పష్టం చేశారు.