కొల్లు నర్సింహారెడ్డి మృతికి రెడ్డి సంక్షేమ సంఘం తీవ్ర సంతాపం
రిపోర్టర్: Raju Reporter
స్థలం: ఆత్మకూర్
మండల కేంద్రానికి చెందిన కొల్లు నర్సింహారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఆత్మకూర్ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, సంఘం ప్రతినిధులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.