డ్రగ్స్ కేసులో వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్ణాటక

బెంగళూరులో రెండేళ్ల కిందట రెండు కిలోల నల్లమందు విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తికి స్థానిక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. 2021 జూలైలో గిరినగర్‌లో కే. భగీరథ దేవాసిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సాక్ష్యాధారాలు, పోలీసుల వాంగ్మూలం ఆధారంగా న్యాయమూర్తి ఈ సంచలన తీర్పు వెలువరించారు.