ఇరాన్ గగనతలంలో విచిత్ర వస్తువు కలకలం

రిపోర్టర్: సునీల్ స్థలం: టెహ్రాన్

ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో అర్ధచంద్రాకారంలో ప్రకాశవంతమైన రంగురంగుల లైట్లతో కనిపిస్తున్న విచిత్ర వస్తువుపై తీవ్ర ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇది అమెరికాకు చెందిన నిగూఢ నిఘా విమానం బ్లాక్ మాంతా అయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఈ నెల 20న టెహ్రాన్ గగనతలంపై కనిపించిన ఈ వస్తువుకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.