భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి కిటకిట: అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయవాడ
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగిసినప్పటికీ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షాధారుల తాకిడి విపరీతంగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భవానీలతో ఆలయ ప్రాంగణం, ఘాట్ రోడ్లు కిటకిటలాడాయి. దీక్షల విరమణ కోసం వచ్చిన భక్తులతో సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వంలో అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.