బొబ్బిలి కోదండ రామాలయంలో ఘనంగా శ్రీకృష్ణ ఉత్సవాలు

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని తారకరామా కాలనీ కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల శర్మ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు.

దుష్ట శిక్షణ కోసం కృష్ణుడు జన్మించాడని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని దివ్య నామస్మరణతో భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.