సింగరేణి అధికారులకు తీపి కబురు: కోల్ ఇండియా తరహాలో వేతనాల పెంపు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సింగరేణి అధికారుల దీర్ఘకాలిక విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కోల్ ఇండియా తరహాలో వేతనాల పెంపు వర్తింపజేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అధికారులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 25 నుంచే ఈ ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని, పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించారు.