మామ ఆంక్షలు భరించలేక కోడలే హత్య చేయించింది

రిపోర్టర్: గోపి స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో సీసీటీవీ నిఘా ఆంక్షలతో విసిగిపోయిన కోడలు శాలు, మామ వినీత్‌ మనోచాను హత్య చేయించింది. పనిమనిషి గౌతంకు రూ.6 లక్షలు సుపారీ ఇచ్చి ఈ దారుణానికి పాల్పడింది. భర్తతో కలిసి బయటికి వెళ్లిన సమయంలో నకిలీ తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు, వ్యాపారి వినీత్‌ను గొంతు కోసి చంపారు. సాంకేతిక ఆధారాల ద్వారా కేసును ఛేదించిన పోలీసులు కోడలు సహా ముగ్గురిని అరెస్టు చేశారు.