ఆర్ఎంపీ వైద్యం వికటించి ఆటో డ్రైవర్ నానా యాతన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఆర్ఎంపీ మల్లేశం నిర్లక్ష్యంతో ఆటో డ్రైవర్ కర్ర వెంకటేశ్వర్లు జీవితం అగమ్యగోచరంగా మారింది. జ్వరం కోసం ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. చెడు రక్తం చేరి రంధ్రం పడటంతో బాధితుడు పలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కిడ్నీపై ప్రభావం పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తుండటంతో, ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.