గ్రామ పంచాయతీలకు తీపి కబురు: నేరుగా ఖాతాల్లోనే సొంత నిధుల జమ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

గ్రామ పంచాయతీల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకున్న ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానాకు మళ్లించకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ చట్ట సవరణ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ జీవో ఎంఎస్ నెం. 43ను జారీ చేసిందని వెల్లడించారు.