మళ్లీ పట్టాలెక్కనున్న అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోన్ ది ఇంటర్న్ హింద రీమేక్

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

అమెరికన్ కామెడీ డ్రామా ది ఇంటర్న్ హిందీ రీమేక్ కోసం గత ఐదేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ ప్రధాన పాత్రల్లో అమిత్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ చిత్రానికి భారతీయ నైపథ్యానికి తగినట్లుగా మార్పులు చేసి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.