ఆరోగ్యానికి పెనుముప్పుగా పదిహేడు అంశాలు: భారత్ ఎదుట తీవ్ర సవాళ్లు

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh / Telangana

ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగాన్ని వణికిస్తున్న పదిహేడు రకాల ముప్పులను లాన్సెట్ సంస్థ తాజాగా విడుదల చేసిందని, ఈ జాబితాలోని అన్ని సమస్యలను భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటోందని మాజీ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, వ్యాక్సిన్లు మరియు క్లైమేట్ టెక్నాలజీలపై పరిశోధనలను పెంచడం, స్వతంత్ర అంచనాల ద్వారా ముప్పులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం అనే మూడు సూత్రాల విధానాన్ని ఆమె గట్టిగా సిఫారసు చేశారు.