బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వింత స్కిన్‌కేర్ రొటీన్: ఐస్ వాటర్‌తో ఫేస్ బాత్
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
తాను మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడనని, ముఖాన్ని ఐస్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటానని బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తెలిపారు. తన చర్మ సంరక్షణ అలవాట్ల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఈ వింత పద్ధతిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చర్మానికి తేమ, రక్షణ ఎంతో అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.