ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వీడాలని అడిషనల్ కలెక్టర్ గర్జన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండపల్లి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం సాయంత్రం దండేపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులు నిరంతరం సేవలందించాలని తెలిపారు.