గోకుల్ చాట్ పేలుళ్ల ఉదంతాలను గుర్తుచేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
దేశంలో గతంలో ఉగ్రవాద దాడి ఘటనలు సాధారణంగా మారిపోయాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు నాటి భయానక వాతావరణాన్ని గుర్తుచేశారంటూ ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతపై గత ప్రభుత్వాల వైఖరిని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదంపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.