ఓటు హక్ కు వినియోగించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను: ప్రజలకు ప్రత్యేక పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: గుంటూరు
ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ లో భాగంగా సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి సాధారణ వరుసలో నిలబడి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్ కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు.