పార్టీ అధినేత కేసీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో కల్వకుంట్ల కవిత విమర్శలు
రిపోర్టర్: రాము
స్థలం: నిజామాబాద్
పార్టీలో అవినీతి నేతలను విమర్శిస్తేనే తనను సస్పెండ్ చేశారని, కానీ అదే గుంటనక్కలతో అంటకాగుతూ పార్టీ అధినేత కేసీఆర్ తీరుతోనే నష్టపోయామని కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధినేతను విమర్శిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె నిలదీశారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, పార్టీ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.