హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో వ్యక్తి ఆత్మహత్య

రిపోర్టర్: మహేష్ స్థలం: కాంగ్రా

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా జ్వాలాముఖి ఆలయంలో రాజస్థాన్ కు చెందిన రాందాస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ లోనిఝలావార్ కు చెందిన రాందాస్ గురువారం సాయంత్రం ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు తండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై దేహ్రా ఎస్పీ సందీప్ ధవల్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.