నా ఆస్తులపై విచారణకు సిద్ధమంటూ సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

తన ఆస్తులపై, రేవంత్రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యాపారం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు. రాజశేఖర్రెడ్డి హయాంలోనే తాను హోటల్ వ్యాపారం ప్రారంభించానని స్పష్టం చేశారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలపై సీఎం సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా మోసపోయారని కేటీఆర్ మండిపడ్డారు.