అమెరికన్ సంగీతకారుడి నివాళి: భారతీయ పైలట్‌కు హిందీ పాటతో ప్రత్యేక కృతజ్ఞతలు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
ఫ్లైదుబాయ్ విమానంలో దాడిని తిప్పికొట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసానికి ఇజ్రాయెల్ అమెరికన్ సంగీతకారుడు ఇటాయ్ బెండా ప్రత్యేకంగా హిందీ పాట పాడి నివాళులర్పించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ ముప్పైవ తేదీన దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో పైలట్ దాడికి పాల్పడగా, తీవ్ర గాయాలపాలైనప్పటికీ ప్రాణాలను లెక్కచేయకుండా క్యాప్టెన్ స్మిత్ సాహసంగా అడ్డుకుని భారీ ప్రమాదాన్ని నివారించినట్లు అధికారులు స్పష్టం చేశారు.