గాయాలను జయిస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న మేడ్చల్ అథ్లెట్ స్నేహ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ మండలం అత్వెల్లికి చెందిన 17 ఏళ్ల యువ అథ్లెట్ మండల స్నేహ సరైన వసతులు లేకున్నా, తీవ్రమైన మోకాలి గాయాన్ని జయించి జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తోంది. పీఈటీ దత్తాత్రేయ మరియు కోచ్ కే. ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ఆమె, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఏకంగా 60 నుంచి 70 పతకాలను సాధించి భవిష్యత్తులో దేశం తరఫున పతకం సాధించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతోంది.