కొత్తవలసలో రూ.50 లక్షలతో బీపీహెచ్‌యూ భవనం ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీపీహెచ్‌యూ భవనాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.