జమ్మూ కాశ్మీర్ ఇక పూర్తి అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం
రిపోర్టర్: రమేష్
స్థలం: India
జమ్మూ కాశ్మీర్ 98.43 శాతం అక్షరాస్యతను సాధించి చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఉల్లాస్-బిఎస్కె పథకం ద్వారా ఈ ఘనత సాధించామని విద్యాశాఖ మంత్రి సకినా ఇటూ ప్రకటించారు. ఇది కేవలం ముగింపు కాదని, ప్రగతికి కొత్త అధ్యాయమని ఆమె పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, వాలంటీర్ల కృషి వల్లే మారుమూల ప్రాంతాల్లో కూడా అక్షరాస్యత సాధ్యమైందని, ఇది మనందరికీ గర్వకారణమని ఆమె ఉద్ఘాటించారు.