లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంటర్ విద్యాధికారి
రిపోర్టర్: వెంకట్
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని ఇంటర్మీడియట్ విద్యాధికారి గోవింద రాం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 50,000 డిమాండ్ చేయగా, బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు రూ. 20,000 లంచం తీసుకుంటుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.