కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స: మంత్రి కోమటిరెడ్డి పరామర్శ
రిపోర్టర్: వెంకట్
స్థలం: నల్గొండ
మాట్లారలేని ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆవేదన తనను తీవ్రంగా కదిలించిందని, పాపకు మాట్లాడగలదనే ఆశతోనే తాను ముందుకు నడిచానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే వెల్లడించారు. నల్గొండలో గురువారం కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆయన స్వయంగా వెళ్లి పాపను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.