దుబాయ్ వేదికగా అక్టోబర్ 1న ఐఎల్టీ20 సీజన్ 5 ప్లేయర్ వేలం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Dubai

దుబాయ్ వేదికగా అక్టోబర్ 1న ఐఎల్టీ20 సీజన్ 5 ప్లేయర్ వేలం జరగనుంది. 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు జరిగే ఈ టోర్నమెంట్ కోసం ఆరు ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తి చేసుకునేందుకు వేలంలో పాల్గొంటాయి. ప్రతి జట్టు రూ. 1.3 మిలియన్ల పర్స్ తో బరిలోకి దిగనుండగా, స్క్వాడ్ కూర్పులో భాగంగా కనీసం 18 నుండి 23 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.