సింధు జలాల మళ్లింపుపై భారత్‌ను హెచ్చరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
రిపోర్టర్: సతీష్
స్థలం: New York
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టారు. నీటి మళ్లింపును యుద్ధ చర్యగా అభివర్ణిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఐరాస వేదికగా మాట్లాడుతూ, పాకిస్థాన్‌కు దక్కాల్సిన నీటి వాటాను నిలిపివేయడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.