తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం: భక్తులతో మాడ వీధులు కిటకిట
రిపోర్టర్: సురేష్
స్థలం: Tirumala
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్పస్వామి పసిడి కాంతులు వెదజల్లే స్వర్ణరథంపై ఆశీనులై భక్తులకు కనువిందు చేశారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ రథోత్సవం కన్నులపండువగా సాగిందని టీటీడీ అధికారులు తెలిపారు.