డెస్టినీ సినిమా లవ్ సాంగ్ విడుదల చేసిన అనిల్ రావిపూడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా నటిస్తున్న డెస్టినీ సినిమాలోని లవ్ మెలోడీ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారని మేకర్స్ తెలిపారు. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరి గుండెలపైన అంటూ సాగే ఈ ప్రేమ గీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.