తీవ్ర తుఫాను ముప్పు: ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
మరో తుఫాన్ ముప్పు మునుముందుకు వస్తున్న నేపథ్యంలో తన రేపటి ఢిల్లీ పర్యటనను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నట్లు CMO ఆంధ్రప్రదేశ్ అధికారికంగా వెల్లడించారు. వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి, నవంబరు రెండు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తరుణంలో ప్రజల రక్షణ, సహాయక చర్యలపై ఆయన అధికారులతో అత్యవసరంగా సమీక్షించనున్నారు.