రణబాలి సినిమాలో రష్మిక జయమ్మ పాత్ర షూటింగ్ పూర్తి
రిపోర్టర్: హరి
స్థలం: భారతదేశం
విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తున్న 'రణబాలి' చిత్రంలో ఆమె జయమ్మ పాత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో రష్మిక ప్రెగ్నెంట్ మహిళగా బేబీ బంప్ తో కనిపించనుంది. తన పాత్ర షూటింగ్ ముగియడంతో బేబీ బంప్ తో ఉన్న స్పెషల్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, విజయ్ దేవరకొండలను హత్తుకుని కృతజ్ఞతలు తెలిపిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.