హైబీపీకి చెక్ పెట్టేలా గోడకుర్చీ వ్యాయామం: పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

రక్తపోటును నియంత్రించడంలో గోడకుర్చీ వ్యాయామాలు అద్భుతంగా పనిచేస్తాయని డాక్టర్ ప్రొఫెసర్ రంజన్ శెట్టి వెల్లడించారు. బీఎంజే ఓపెన్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ జర్నల్లో ప్రచురితమైన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. రోజువారీ వ్యాయామాలతో పాటు ఈ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ చేయడం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగై గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.