భారీ వర్షంతో కళకళలాడుతున్న కేసముద్రం చెరువులు
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కురిసిన భారీ వర్షానికి కల్వల గ్రామంలోని తుమ్మల చెరువు నిండి మత్తడి దూకింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఎదుర్కొంటున్న రైతన్నలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. సాగు చేసిన వరి పంటలకు జీవం పోసిందని, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.