ఢిల్లీలో త్రిపుర యువకుడిపై జాతి వివక్ష: నిందితుడిని అరెస్ట్ చేయాలని నేతల డిమాండ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Agartala

ఢిల్లీలో త్రిపుర యువకుడిపై కంటెంట్ క్రియేటర్ అమీర్ షోకీన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై త్రిప్రా మోథా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దెబ్బర్మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్ర ప్రజలకు జరిగిన తీవ్ర అవమానమని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని త్రిపుర ప్రతిపక్ష నేత జితేంద్ర చౌధురితో పాటు పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.