గురువే మార్గదర్శకుడు: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమని వెల్లడి
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం పాఠశాల ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు మాట్లాడుతూ, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి గురువు పాత్ర అత్యంత కీలకమని, మారుతున్న డిజిటల్ యుగంలోనూ గురువు స్థానం ఎప్పటికీ సుస్థిరమని స్పష్టం చేశారు. ప్రతి పసివాడి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత గొప్పదని, ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించాలని పిలుపునిచ్చారు.