చెన్నైలో రూ.1,200 కోట్లతో నూతన సచివాలయ నిర్మాణానికి నిర్ణయం

రిపోర్టర్: శివ స్థలం: తమిళనాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో మెరీనా బీచ్ సమీపంలోని పట్టినపాక్కమ్‌లో రూ. 1,200 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 25.55 ఎకరాల స్థలంలో 15 అంతస్తులతో ఈ ప్రపంచ స్థాయి పరిపాలనా కేంద్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత సచివాలయంలో స్థలాభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.