మృత్యుఒడికి చేరిన నిండు ప్రాణాలు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
విశాఖలో జరుగుతున్న ఆర్మీ సెలక్షన్ ప్రక్రియలో పలాస ప్రాంతానికి చెందిన శేషగిరిరావు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి విశాఖ వెళ్లిన ఆయన, బీచ్ రోడ్లో అధికారుల పరిశీలన సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు మూడో పట్టణ పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ అకస్మాత్తు ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.