లింగాపూర్ ఎస్బీఐ నూతన మేనేజర్ సంతోష్ కుమార్ను ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ ఎస్బీఐ బ్యాంకులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేనేజర్ సంతోష్ కుమార్ను మాజీ జెడ్పీటీసీ భూక్యా అమ్మి బాబూరావు, సర్పంచ్ కుమ్మరి రంజిత్ ఘనంగా సన్మానించారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. బ్యాంకు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, నాయకులు కోళ్ల నరేష్, నిమ్మల సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.