ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా దాచేపల్లి శ్రీనివాస్ ఎంపిక: పలువురి శుభాకాంక్షలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు దాచేపల్లి శ్రీనివాస్ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మొదటినుంచి చురుగ్గా పనిచేస్తూ, స్థానిక యువతను ఎల్లప్పుడూ వెన్నుంటి ప్రోత్సహిస్తున్న శ్రీనివాస్ నియామకంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని దాచేపల్లి శ్రీనివాస్ పేర్కొనగా, పలువురు నాయకులు ఆయనను కలసి శాలువాతో సత్కరించి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.