సంజు శాంసన్ కెరీర్‌పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: రమేష్ స్థలం: India

భారత క్రికెటర్ సంజు శాంసన్ కెరీర్‌లో ఎదుర్కొంటున్న నిరంతర అనిశ్చితి అతనిపై తీవ్ర మానసిక ఒత్తిడిని చూపుతోందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ప్రదర్శనలు చేసినప్పటికీ జట్టులో స్థిరమైన స్థానం దక్కకపోవడం బాధాకరమన్నారు. 2014 నుంచి సాగుతున్న అతని ప్రయాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, పదేపదే జట్టులోకి తీసుకోవడం, తొలగించడం వల్ల ఆటగాడి మనస్తత్వంపై ప్రభావం పడుతుందని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు.