హైదరాబాద్‌లో ఈ వారంలో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఈ వారంలోనే ఫ్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనుంది. లక్కీ డ్రా ద్వారా 7,340 మందిని ఎంపిక చేయగా, ఇప్పటివరకు 5,521 మందిని పూర్తి అర్హులుగా నిర్ధారించారు. ఒక్కో ఫ్లాట్‌పై రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తుండగా, బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు.