ఉపాధి హామీ మెటీరియల్ బకాయిలు వంద కోట్లకు పైగా పెండింగ్
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు రూ.127 కోట్లకు చేరాయి. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లాలో రహదారులు, కాలువలు తదితర పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొత్త సాఫ్ట్వేర్ అనుసంధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా బిల్లుల ఆమోదం తాత్కాలికంగా ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే సాంకేతిక ఇబ్బందులు తొలగించి బకాయిలు మంజూరు చేస్తామని పంచాయతీ రాజ్ ఈఈ టీవీ రమణమూర్తి వెల్లడించారు.