దిల్లీ మార్చ్ కు వచ్చే ప్రజలు వ్యాపారులకు అండగా నిలవాలి: రాహుల్ గాంధీ
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
దిల్లీలో జరగనున్న భారీ రామలీలా మార్చ్ లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది పండుగల సీజన్ కావడంతో స్థానిక వ్యాపారులకు ప్రజలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనలు, ర్యాలీలు చేపడుతూనే మరోవైపు షాపింగ్ కూడా చేయాలని కోరారు. తద్వారా దిల్లీ వ్యాపార వర్గాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.