రాజధాని అమరావతి పనులపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Amaravati
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్లు I&PR AP వెల్లడించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖా మంత్రి పి.నారాయణతో పాటు వివిధ నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత నెలలో రాజధాని పరిధిలో రూ.1,345 కోట్ల విలువైన పనులను వివిధ సంస్థలు పూర్తి చేశాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.