'సకల చేతివృత్తుల సృష్టికర్త విశ్వకర్మ': కాకర్ల సురేష్
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజలకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత సృజనాత్మకత, కళా నైపుణ్యాలతో జాతి అభ్యున్నతికి, ప్రగతికి నిరంతరం తోడ్పడుతున్న చేతివృత్తి కళాకారులకు మరియు విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సకల చేతివృత్తుల సృష్టికర్త అయిన విశ్వకర్మ దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కాకర్ల సురేష్ ఈ మేరకు ప్రత్యేక సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.