యాదాద్రి ఆలయం వద్ద ఉద్రిక్తత: కుమ్మరి హక్కులపై ఇరువర్గాల భీకర ఘర్షణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ పరిధిలోని శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం వద్ద దేవాలయ హక్కుల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆలయ హక్కులు మరియు కుమ్మరి హక్కుల విషయమై రెండు రెవెన్యూ గ్రామాల ఇరువర్గాల ప్రజల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే వరకు వెళ్లిందని, మహిళలు జుట్లు పట్టుకుని కొట్లాడుకున్నారని స్థానికులు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.