ట్యాంకుబండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

ట్యాంకుబండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో కురుమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత పాలకుల కాలయాపనను ఎండగడుతూ, ఈ నిర్ణయాన్ని బహుజన సమాజం స్వాగతించిందని, వరంగల్ విమానాశ్రయానికి కూడా ఆయన పేరు పెట్టాలని నేతలు విజ్ఞప్తి చేశారు.