అమెరికా ఎన్నికల్ లో ట్రంప్ కు ఎదురుదెబ్బ: భారత్ కు భారీ ఊరట లభించే అవకాశం
రిపోర్టర్: హరి
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికలలో డెమొక్రాట్ పార్టీ సాధించిన ఘనవిజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని రాజకీయ షాక్ ఇచ్చిందని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటినీ డెమొక్రాట్లు కైవసం చేసుకోవడంతో ట్రంప్ బలహీన అధ్యక్షుడిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఈ పెను రాజకీయ మార్పు భారత విదేశాంగ, వాణిజ్య విధానానికి సరికొత్త వ్యూహాత్మక ఊరటను ఇస్తుందని నిపుణులు వెల్లడించారు.