యాదగిరిగుట్టలో అక్రమ ఫామ్ ల్యాండ్ వెంచర్ల దందా: కలెక్టర్ కు ఫిర్యాదు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Yadadri Bhongir

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట రెవెన్యూ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే న్యూ విజన్ ఇన్ఫ్రా ప్రకృతి నిలయం పేరుతో అక్రమ ఫామ్ ల్యాండ్ వెంచర్ నిర్వహిస్తూ ప్లాట్ల విక్రయాలు సాగిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పేరు చెప్పి అమాయక ప్రజలను ఆకట్టుకుంటూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుపుతున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి అక్రమ వెంచర్లపై తగు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.